హైదరాబాద్‌కు భారీగా తరలిన కార్యకర్తలు
తెలంగాణ అభివృద్ధికి ప్రధాని కట్టుబడి ఉన్నారు
పట్టణ అధ్యక్షుడు రాపెళ్లి శ్రీధర్
వేములవాడ, వాయిస్ ఆఫ్ వందే భారత్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు వేములవాడ పట్టణం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం భారీ సంఖ్యలో తరలివెళ్లారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ సభను విజయవంతం చేసేందుకు పట్టణ అధ్యక్షుడు రాపెళ్లి శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఉత్సాహంగా బయలుదేరారు. ఈ సందర్భంగా రాపెళ్లి శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని మోదీకి ఉన్న ప్రత్యేక మక్కువతో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని కొనియాడారు. “తెలంగాణ పురోగతికి మోదీ సర్కార్ కట్టుబడి ఉంది. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. అందుకే ఈ చారిత్రాత్మక సభకు కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పుకు నాంది పలుకుతుందని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. ఈ పర్యటనలో మున్సిపల్ కౌన్సిలర్ వంగల శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్, పిన్నింటి హనుమంతులు, వాస మల్లేశం, బిల్ల కృష్ణా, రేగుల శ్రీకాంత్, మామిండ లక్ష్మీరాజం, మహంకాళి శ్రీనివాస్, మనోజ్, యశ్వంత్, మెరుగు లక్ష్మణ్, బాలశేఖర్, మల్లెపు లక్ష్మణ్‌తో పాటు పట్టణ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.