సెయింట్ థామస్ హైస్కూల్లో ఘనంగా సైన్స్ ఫెయిర్

సెయింట్ థామస్ హైస్కూల్లో ఘనంగా సైన్స్ ఫెయిర్

వాయిస్ ఆఫ్ భారత్, వరంగల్ : విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు సెయింట్ థామస్ హై స్కూల్ వేదికగా భారీ సైన్స్ ఫెయిర్ (విజ్ఞాన ప్రదర్శన) నిర్వహించారు. ఈ ప్రదర్శన ఉదయం 10:00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 01:00 గంటల వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ విద్యావేత్తలు, వైద్య నిపుణులు విచ్చేశారు. పంబి టాటాజీ   ఎక్సైజ్ క్లినిక్ సీనియర్ న్యూట్రిషనల్ వెల్నెస్ సలహాదారు.డాక్టర్ శ్రీనివాస్ సూత్రపు (M.Pharm, Ph.D): సహస్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ పార్మాస్యూటికల్ సైన్సెస్ (ఆరేపల్లి) ఫార్మకాలజీ విభాగం ప్రొఫెసర్, హెచ్ఓడి.డాక్టర్ సుజాత (MD): నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ హాజరయ్యారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులు, పర్యావరణ హిత నమూనాలు, నూతన ఆవిష్కరణలు ప్రదర్శించారు. ఈ విజ్ఞాన మేళాలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాభిమానులు పాల్గొన్నారని పాఠశాల కరస్పాండెంట్ జె. మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *