సమాజ సేవకు అంకితమైన డాక్టర్ అక్షిత/ Dr. Akshita is dedicated to community service
ప్రజా వైద్యురాలిగా అరుదైన గుర్తింపు
నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న అక్షిత
వాయిస్ ఆఫ్ భారత్, కరీంనగర్ (సెప్టెంబర్ 06) : ప్రజల కోసం బతకడమే నిజమైన త్యాగమని నమ్మే డాక్టర్ అక్షిత, తాను నేర్చుకున్న విద్యను సమాజ సేవకు ఉపయోగిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ యువ వైద్యురాలు, తన నిస్వార్థ సేవలతో ‘ప్రజా వైద్యురాలిగా’ అరుదైన గుర్తింపు పొందారు. నేడు ఆమె పుట్టిన రోజు జరుపుకుంటున్న అక్షిత తన సేవలను ప్రజల కోసమే అన్నట్లు జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది
దాతృత్వమే ఆమె జీవన విధానం
చిన్నతనం నుంచే దైవభక్తి, సేవాభావం మెండుగా ఉన్న అక్షిత, తన కష్టంతో సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో పాటు, ఇతరులకు సాయం చేయాలనే దయార్ద హృదయంతో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే ఆమెను ‘పేదల డాక్టర్’గా నిలబెట్టింది. తన వైద్య పరిజ్ఞానాన్ని ప్రజారోగ్యం కోసం ఉపయోగిస్తూ, ఉన్నంతలో నలుగురికి సాయం చేయడంలోనే ఆమె నిజమైన సంతృప్తిని పొందుతున్నారు.
నిరంతర విద్యార్థిగా అక్షిత ప్రస్థానం
బ్యాచిలర్ ఆఫ్ నాటురోపతి అండ్ యోగిక్ సైన్స్ (BNYS), ఆయుర్వేదంలో పట్టా పొందిన డాక్టర్ అక్షిత, ప్రత్యేక చికిత్సా విధానాలతో ప్రజల రోగాలను నయం చేస్తున్నారు. ఆమె కేవలం వైద్య సేవలకు మాత్రమే పరిమితం కాకుండా, డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో కూడా పట్టా సాధించారు. అయినా, ఆమె ఇంకా నిత్య విద్యార్థిగా కొత్త కోర్సులను అభ్యసిస్తూ తన జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకుంటూ, వారికి సాయం అందించడంలో అందెవేసిన చెయ్యిగా పేరు పొందిన డాక్టర్ అక్షితకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
