సమన్వయంతో పనిచేద్దాం..

సమన్వయంతో పనిచేద్దాం..
  • రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం
  • వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

(వాయిస్ ఆఫ్ భారత్, క్రైం న్యూస్) ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పాటు ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాల నివారణకు పనిచేద్దామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అధికారులకు సూచించారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 14వరకు నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని సీపీ అధ్యక్షతన వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా విభాగం, పోలీసు అధికారులు, స్థానిక ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, బులియన్‌ మర్కెట్‌, ఇతర వ్యాపార సముదాయాలకు చెందిన కార్యవర్గ సభ్యులు పాల్గోన్న ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా గంటకు యాబైకి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే ఇందులో 19మంది మరణిస్తున్నారన్నారు. రోజు రోజుకి వాహనాల సంఖ్య ఘననీయంగా పెరుగడంతో అదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రమాదాల్లో మరణించిన వ్యక్తుల కుటుంబాలు రోడ్డున పడటంతో పాటు వారి కుటుంబ సభ్యుల జీవితాలు చిద్రమవుతున్నాయన్నారు. అయితే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రజలు సైతం భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం ముందుస్తూ ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హై స్పీడ్‌ వాహనాల వినియోగంలో వాహనదారులతో పాటు వారి కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదాలపై అవగాన కల్పించాలని, అలాగే అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించడం లాంటి చర్యలకు వాహనదారులు పాల్పడకుండా కళాశాల విద్యార్థులతో పాటు, ప్రజలకు అవగాహన తరగతులను నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ, స్టేట్‌ ప్రధాన రోడ్డు మార్గాలను కలిపే రోడ్లకు అనుసంధానమైన గ్రామాల్లో రోడ్డు సేఫ్టీ కమీటీలను ఏర్పాటు చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడం ద్వారా మరణాల శాతాన్ని తగ్గించగలమన్నారు. ప్యాసింజర్‌ వాహనాలదారుల్లో మార్పు వచ్చే సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర రోడ్‌ సెఫ్టీ విభాగానికి చెందిన ఇన్స్‌స్పెక్టర్‌ రవి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై రవాణా శాఖ రూపోందించిన వాల్‌ పోస్టర్లు, కరప్రతాలను పోలీస్‌ కమిషనర్‌ అవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ అఫీసర్‌ పురుషోత్తం, ఆర్టీఓ రంగారావు, ఏసీపీలు జితేందర్‌ రెడ్డి, రమేష్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఇన్స్‌స్పెక్టర్లు వెంకన్న, సీతారెడ్డి, సుజాత, ఎంవీఐలు రమేష్‌ రాథోడ్‌, రవీందర్‌, స్వర్ణలత, షాలిని, ఫహిమా, శ్రీనివాస్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, బిలియన్‌ మార్కెట్‌ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌తో పాటు ఇతర వ్యాపారస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *