విలీన సభ పోస్టర్ ఆవిష్కరణ.

విలీన సభ పోస్టర్ ఆవిష్కరణ.

బలమైన విప్లవ కార్మికో ద్యమ నిర్మాణం,విస్తరణకై జనవరి 18న కొత్తగూడెం లో నిర్వహించే ఐఎఫ్టియు ల విలీనా సభను జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన ప్రచార వాల్ పోస్టర్లను సోమవారం ఇల్లందు సి హెచ్ పి రైల్వే గేట్ దగ్గర కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులతో పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల ఆటో&మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు,తెలంగాణ మోటర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి MD. రాసుద్దిన్, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా కుదించి కార్మిక హక్కులను కాల రాస్తుందని విమర్శించారు. ప్రభుత్వరంగ పరిశ్రమల పరిరక్షణకై ఉద్యమించాలని, ప్రైవేటీకరణ,కార్పొ రేటికరణ విధానాలను ప్రతిఘటించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.జనవరి 18న కొత్తగూడెం క్లబ్లో నిర్వహించే ఐఎఫ్టియు ల విలీన సభ,ర్యాలీకి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మోటర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు డి.మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మోరే వెంకటేశ్వర్లు,పి.రమేష్,విజయ్,చిరంజీవి, చారి,ఆకాష్,బాలు తదితరులు పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *