విద్యార్థుల ఉన్నతే లక్ష్యం/The goal is the progress of students
ఘనంగా గౌతమి జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ
వాయిస్ ఆఫ్ భారత్, భీమారం : హనుమకొండలోని భీమారంలో ఉన్న గౌతమి జూనియర్ కళాశాల బుధవారం ఎం.టీ.ఆర్. గార్డెన్స్‌లో తమ ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థుల కోసం ఘనంగా పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించింది. కళాశాల డైరెక్టర్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు డాన్స్, విన్యాసాలతో తమ ప్రతిభను ప్రదర్శించి అందరినీ అలరించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుతాయని, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయని డైరెక్టర్లు తెలిపారు. కేవలం విద్యాపరంగానే కాకుండా, ఇలాంటి సహ-పాఠ్య కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల వారి వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు. డైరెక్టర్లు మాట్లాడుతూ “విద్యార్థులు చదువులో కూడా ముందంజలో ఉండాలి. ప్రతి విషయంలో వారిని జాగ్రత్తగా చూసుకుంటూ, ఉన్నత స్థాయికి తీసుకుపోవడమే మా కళాశాల లక్ష్యం” అని అన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు మంతెన భిక్షపతి, గొట్టె లక్ష్మణ్, బండి పరశురామ్, మల్ల ధనుంజయ, అంభీర శ్రీకాంత్, సందరాజు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
