వాగ్దేవిలో ఘనంగా విబా 2.0

వాగ్దేవిలో ఘనంగా విబా 2.0
Vibha 2.0 %%%celebrated in ###Vagdevi

వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : విద్యార్ధులను ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీలో విబా 2.0 ఘనంగా ప్రారంభమైంది. ఈ సంవత్సర కాలంలో వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీ, వాగ్దేవి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీ, మేనేజ్ మెంట్ కళాశాలల విద్యార్థులను పారిశ్రామిక వేత్తలుగా (ఇంట్రిప్రెన్యూర్ లు)గా మలిచేందుకు గత కొన్ని సంవత్సర కాలంగా వాగ్దేవి ఇంక్యుబేటర్ అండ్ బిజినెస్ ఆక్సిలరేషన్ (VIBA విబా) ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. ఫౌండర్స్ లాబ్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారి ఆలోచనలను కమర్షియల్ బిజినెస్ లుగా మలచడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో విబా 60 మందికి పైగా విద్యార్థులు తమ ఆలోచనలను ఎంటర్ప్రెన్యూర్షిప్ వైపు మళ్లించగలిగారు. ఈ క్రమంలో 15 మంది విద్యార్థులు విభా సహకారంతో పూర్తిస్థాయి బిజినెస్ లుగా తీర్చిదిద్దుకోగలిగారు. ఇదే క్రమంలో అనేకమంది విద్యార్థులు తమ కెరీర్ ను ఎంట్రప్రెన్యూర్ షిప్ వైపు మళ్లించగలుగుతున్నారు. ఈ నేషనల్ స్టార్ట్ అప్ దినోత్సవం నాడు, ఈ సందర్భంగా వాగ్దేవి కళాశాలల సంయుక్త కార్యదర్శి డాక్టర్ సత్యపాల్ రెడ్డి హాజరై విబా ద్వారా 15 మంది విద్యార్థులకు 2.5 లక్షల ప్రోత్సహక పెట్టుబడి అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిలిటీ ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ రాజా గయం, మోనిత్ర హెల్త్ కేర్ సీఈఓ రవి భోగు హాజరై ప్రారంభించడం విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డాక్టర్ కె. ప్రకాష్, సయ్యద్ ముస్తాక్ అహ్మద్, కమల్ యాదవ్ లు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ తిరుపతి రావు, డీన్ శశిధర్, విబా డైరెక్టర్ డాక్టర్ శాంత థౌతం, సీఈఓ సలీమ్ జివానీ, ఫౌండర్స్ ల్యాబ్ సీఈఓ శకుంతల, వివిధ విభాగాధిపతులు, విబా విద్యార్థుల బృందం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *