రాజకీయంగా, ఆర్థికంగా పద్మశాలీలు ఎదగాలి

రాజకీయంగా, ఆర్థికంగా పద్మశాలీలు ఎదగాలి
The Padmashalis should rise politically and economically.

పద్మశాలి సామాజికవర్గ ప్రతినిధులు
నూతన కౌన్సిలర్లకు ఘన సత్కారం

వాయిస్ ఆఫ్ భారత్, జనగామ : జనగామ మున్సిపల్ కౌన్సిలర్లుగా ఘన విజయం సాధించిన పద్మశాలి సామాజికవర్గ ప్రతినిధులను గురువారం పద్మశాలి సంఘం నేతలు ఘనంగా సత్కరించారు. లింగాల ఘనపూర్ మండలానికి చెందిన పద్మశాలి సంఘం నాయకులు బిట్ల బాబు, కారంపూడి చంద్రయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని కౌన్సిలర్ల నివాసాలకు వెళ్లి వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పద్మశాలి బంధువులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు వార్డు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని కోరారు. దోర్నాల అనిత వెంకటేశ్వర్లు (11వ వార్డు కౌన్సిలర్), ఎనగందుల అనూష కృష్ణ (12వ వార్డు కౌన్సిలర్), వంగ ఉమా యుగంధర్ (కౌన్సిలర్) లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారతి సొసైటీ అధ్యక్షుడు గుర్రం నాగరాజు, కాముని వేణుగోపాల్, ఎనగందుల వెంకటేష్, గూడెల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *