మృతుడి కుటుంబానికి పరామర్శ
వాయిస్ ఆఫ్ భారత్, ఆత్మకూర్ : మండలంలోని నాగయ్యపల్లె గ్రామానికి చెందిన గుండాల భయన్నఇటీవల అనారోగ్యంతో మరణించగా డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది, అసైన్డ్ భూమి సమితి (ఏబీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు రూ.4,000 ఆర్థిక సహాయం అందించారు. గుండాల భయన్న కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాదాసి శ్రీనివాస్, మాదాసి సాంబయ్య, గుండాలమోహన్, మాదాసి సారంగం, గుండాల మల్లస్వామి, మాదాసి సిద్ధార్థ, మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
