ముఖేష్ అంబానీ అత్యంత ధనవంతుడు: ఫోర్బ్స్ జాబితా
ముఖేష్ అంబానీ అత్యంత ధనవంతుడు: ఫోర్బ్స్ జాబితా
Voice of Bharat (national news): ఫోర్బ్స్ విడుదల చేసిన భారతదేశపు 100 మంది అత్యంత ధనవంతుల జాబితాలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ $105 బిలియన్ల నికర విలువతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ జాబితాలో ఆయన ఒక్కరే సెంటీబిలియనీర్గా ఉన్నారు. రెండో స్థానంలో గౌతమ్ అదానీ కుటుంబం $92 బిలియన్ల సంపదతో నిలిచింది. 2023లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు నిరూపితం కాకపోవడంతో అదానీ గణనీయంగా పుంజుకున్నారు.
మూడవ స్థానంలో ఉన్న సావిత్రి జిందాల్ ($40.2 బిలియన్లు) దేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా కొనసాగుతున్నారు. భారతి ఎయిర్‌టెల్‌కు చెందిన సునీల్ మిట్టల్ మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలవడమే కాక, ఈ ఏడాది అత్యధికంగా $3.5 బిలియన్లు లాభపడిన వ్యక్తిగా నమోదయ్యారు.
మొత్తంమీద, 2025లో భారతదేశంలోని 100 మంది సంపన్నుల సంయుక్త సంపద $100 బిలియన్లు లేదా 9% తగ్గి $1 ట్రిలియన్కు చేరుకుంది. ఈ జాబితాలో చేరడానికి అర్హత (కటౌఫ్) గత సంవత్సరం $3.3 బిలియన్ల నుండి $3.2 బిలియన్లకు స్వల్పంగా తగ్గింది. కొత్తగా చేరిన వారిలో దోషి సోదరులు (నం. 37) మరియు సునీల్ వచాని (నం. 80) ఉన్నారు.
