మహా గణపతికి నైవేద్యంగా బాహుబలి లడ్డు
వాయిస్ ఆఫ్ భారత్ (కల్చరల్) : మణికంఠ కాలనీ డెవలప్ మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి నవరాత్రి ఉత్సవం ఆరవ రోజు సందర్భంగా బయ్య అశోక్ -స్వప్న 216 కిలోల లడ్డును మహా గణపతికి నైవేద్యంగా పెట్టారు. బాహుబలి లడ్డు శోభయాత్ర లడ్డు దాత భయ్యా స్వప్న అశోక్ ఇంటి నుంచి 100 ఫీట్ రోడ్డు మీదుగా పోచమ్మ టెంపుల్ నుంచి మణికంఠ కాలనీ డెవలప్ మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి మండపం వద్దకు అధ్యక్షుడు పోతు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాలనీ మహిళలు మంగళ హారతుల తో తీసుకువచ్చారు. పిల్లలు పెద్దలు, కమిటీ సభ్యులు వ్యాపారవేత్తలు, ఆర్ఎస్ఎస్ సంఘ సేవ కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు , రాజకీయ నాయకులు, 14 డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంతియాజ్, సిలువేరు శ్రీనివాస్, 14వ డివిజన్ బీజేపీ నాయకులు ముడుసు నరసింహ, దూపం సంపత్ కుమార్, గుండేటి నరేందర్, నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గుంటి రజనీ కిషన్, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రెజరర్ కంచ సంపత్, అడ్తి సెక్షన్ మాజీ అధ్యక్షుడు పోతు కుమార్ స్వామి, వ్యాపారవేత్తలు నందిని చిల్లీస్ సదానందం, మాడిశెట్టి శ్రీధర్, విజయ భాను తదితరులు పాల్గొన్నారు.
