మండలంలో పలు అలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు
మండలంలో పలు అలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు
వాయిస్ అప్ భారత్ (బయ్యారం లోకల్ న్యూస్):
బయ్యారం మండలంలోని పలు అలయాల్లో శ్రీరామనామా నవమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలోని రామాలయంలో మూడు రోజుల పాటు పలు కార్య్రకమాలు ఘనంగా నిర్వహించారు. 15వ తేదీన సోమవారం ప్రారంభమైన వేడుకలు మంగళ వాయిద్యములు, తోరణాలంకరణ జరుపగా, 16న శ్రీ సీతా రామచంద్ర లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వార్లకు పంచామృతాభిషేకం, అలంకరణ అర్చన అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. బుధవారం సీతారామ చంద్రస్వామి కళ్యాణం, అనంతరం మహాఅన్న సంతర్పణ జరిగింది. అలాగే ఆంజనేయ స్వామి దేవాలయంలోవేడుకలు నిర్వహించారు. మండలంలోని పెత్తాళ్లగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతీయ సంప్రదాయంలో శ్రీరామనామానికి అత్యంత ప్రాధాన్యత కలదు. శ్రీరామ నవమి విష్ణువు యొక్క అవతారాలలో ఒకరైన శ్రీరాముని జన్మ జ్ఞాపకార్థం జరుపుకునే పండుగ. శ్రీరామనామా నవమి ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో వస్తుంది,
