ప్రజా సాహిత్యానికి ఊపిరి.. వట్టికోట ఆళ్వార్ స్వామి

ప్రజా సాహిత్యానికి ఊపిరి.. వట్టికోట ఆళ్వార్ స్వామి
  • ‘తెలంగాణదనం’తో ప్రజా జీవితాన్ని చిత్రించిన తొలి నవల ‘ప్రజల మనిషి’ ‌
  • నేడు ఆయన వర్ధంతి ఫబ్రవరి 6

అది సాంఘిక నవల, తెలంగాణ ప్రజా పోరాటానికి ప్రభావితులై బొలిలముంత శివరామకృష్ణ ‘మృత్యుంజయులు’ మహిధర రామమోహనరావు గారి ‘ఓనమాలు’ ‘మృత్యువు నీడలో’ లక్ష్మికాంత మోహన్ ‘సింహగర్జన’లు వచ్చాయి. అయితే వాటిలో ‘తెలంగాణదనం’ కొరవడింది. అందువల్ల ‘తెలంగాణదనం’తో ప్రజా జీవితాన్ని చిత్రించిన తొలి నవల ‘ప్రజల మనిషి’ అవుతుంది.

వట్టికోట ఆళ్వార్ స్వామి పిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. ఓ దయగల కుటుంబం అతన్ని చేరదీస్తే. వారికి వంట చేసి పెడుతూ పొట్టపోషించుకున్నాడు. ఆ కుటుంబానికి వంట పని, టి పని చేసి పెడుతూనే చదువను, రాయనూ నేర్చుకున్నాడు. యుక్తవయసొచ్చాక హోటళ్లో సర్వరుగా పని కుదిరాడు. ఆ పని చేస్తూనే గ్రంథాలయాలకు వెళ్ళి గ్రంథ పఠనం చేస్తూ ఎనలేని విజ్ఞానాన్ని సంపాదించాడు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. గొప్ప మానవతావాది గానూ, పరిశోధనాత్మక పాత్రికేయుడిగానూ ప్రముఖ నవలా కారునిగాను తీర్చిదిద్దింది. అంతేకాదు సమాజంలో దోపిడికి సరయ్యే వారి పక్షాన కలం ఝళిపించి, గళం కంగుమనిపించిన ఉద్యమ నేతగానూ భాసిల్లాడు. భూస్మాములు, దొరలు, దేశ్‌ముఖ్‌ల, పాలకుల దాష్టికానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభలోను పని చేశాడు. చివరికి కమ్యూనిస్టు పార్టీలో చేరి జైలు జీవితమూ గడిపాడు. ఆ విధంగా అణగారిన జన సంక్షేమానికి జీవితాన్ని అర్పించిన దార్శనీకుడుగా నిలిచాడు ఆయనే వట్టికోట ఆళ్వారు స్వామి. 1942లో క్విట్ ఇండియా ప్రేరణతో సికిందరాబాద్ లో కాంగ్రెస్ వాదిగా సత్యగ్రహంలో పాల్గొన్నడు. ఆ సందర్భంగా నిజాం ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది.

ఏడాది పాటు సికిందరాబాద్ జైల్లో ఉంచింది. అక్కడ కమ్యూనిస్టు నాయకులతో పరిచయమూ, సాన్నిహత్యము ఏర్పడింది. కమ్యూనిజం ఆశయాలు, ఆదర్శాలు, పోరాట నిబద్ధతలతో ప్రభావితుడయ్యాడు. 1943 ఫిబ్రవరిలో జరిగిన ప్రథమాంధ్ర అభ్యుదయ రచయితల సంఘం మహాసభల్లో కార్యవర్గ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. అదే ఏడాది చదలవాడ పిచ్చయ్య చొరవతో ‘మీజాన్’ పత్రిక కార్యాలయంలో ఏర్పడిన తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘానికి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1944లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించాడు. కొద్ది కాలంలోనే ఆయన పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకడుగా గుర్తింపును, గౌరవాన్ని పొందారు. వట్టికోట ఆళ్వార్ స్వామి తెలంగాణా ప్రజా ఉద్యమానికి, ప్రజా సాహిత్యానికి ఊపిరి వంటి వారు. ఆళ్వార్ స్వామి తన ప్రజా జీవితపు అనుభవాలు రంగరించి ‘ప్రజల మనిషి’ అనే ఉత్తమ నవల వ్రాశారు. తెలంగాణ జన జీవితం తెలియపరచాలనే తపన ఉంది. అందుకే ‘ప్రజల మనిషి’ ఆళ్వార్ స్వామి తొలి ప్రయత్నం అయినా ఉత్తమ నవలగా ప్రశంసలందుకుంది. ‘ప్రజల మనిషి’ తెలంగాణమును గురించి తెలంగాణవాడు వ్రాసిన తొలి నవల భాస్కరభట్ల కృష్ణారావు గారు ‘యగసంధి’ వ్రాసిన మాట నిజాం ఆంధ్రలో ప్రజా పోరాటాల చిత్రణ కనిపించదు.

అది సాంఘిక నవల, తెలంగాణ ప్రజా పోరాటానికి ప్రభావితులై బొలిలముంత శివరామకృష్ణ ‘మృత్యుంజయులు’ మహిధర రామమోహనరావు గారి ‘ఓనమాలు’ ‘మృత్యువు నీడలో’ లక్ష్మికాంత మోహన్ ‘సింహగర్జన’లు వచ్చాయి. అయితే వాటిలో ‘తెలంగాణదనం’ కొరవడింది. అందువల్ల ‘తెలంగాణదనం’తో ప్రజా జీవితాన్ని చిత్రించిన తొలి నవల ‘ప్రజల మనిషి’ అవుతుంది. ఆళ్వార్ స్వామి కమ్యూనిస్టు. అందువల్ల అతడు నాస్తికుడని కాదు. నాస్తికులందరూ కమ్యూనిస్టులు కారు. అలాగే కమ్యూనిస్టులంత విధిగా నాస్తికులు కానక్కరలేదు. అతడు స్తికుడనీ చెప్పలేం. అంటే నిత్య సంధ్యలు, వ్రతాలు, పూజలు, భక్తి ప్రకటన చేసేవాడు కాదు. ఆ తరం హేతుబద్ద ఆలోచనా విధానంలో పెరిగిండు. ఆళ్వారు స్వామికి దేవుని మీదకన్న మనిషి మీద, సమాజం మీద అనంతమైన విశ్వాసం ఉండేది. వారు తమ తొలి నవలకు పేరు పెట్టడానికి దారితీసిన దంతం అందుకు నిదర్శనం. వారు త్యాగయ్య పిక్చర్ చూచారు. నాగయ్య నటించిన గొప్ప చిత్రం. అది నాగయ్య పోతన చిత్రంలో పోతన అవతారం. గౌరీనాథశాస్త్రి శ్రీనాథుని అవతారం దాల్చారు. అలాగే నాగయ్య త్యాగయ్యగా అవతరించారు. ఆ చిత్రం ఆళ్వార్ స్వామి మీద ఎంతో ప్రభావం వేసింద.

భక్తి పరంగా కాదు దేవున్ని నమ్ముకున్నవాడే బ్రతక కలుగుతే ప్రజలను నమ్మకున్న వాడు బ్రకలేడా అని అతని నవలకు ‘ప్రజల మనిషి’ అని పేరు పెట్టారు. ఆళ్వారుస్వామి తిరుపతి వెళ్లివచ్చారు. తన కొడుకుకు శ్రీనివాస్ అని పేరు పెట్టారు. వారిది సంకల్పబలం కమ్యూనిస్టుగానే 6-2-1961న కన్నుమూశారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా కాలం చేశారు. అరుణ పతాకచ్చయలో అంత్యక్రియలు జరిగాయి. ఆళ్వార్ స్వామికి ధర్మపత్ని యశోదమ్మ-కొడుకు శ్రీనివాస్. ‘ఆళ్వార్’ ఏదో ఒక మనిషి పేరు కాదు అదో విధానమంటే ఏదో క కార్య విధానము కాదు. అదొక జీవిత విధానము’ అది కాళోజీ నివాళి. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ‘అగ్నిధార’ కావ్యాన్ని, ఆళ్వార్ స్వామికి అంకితం ఇచ్చారు. ‘ఎక్కడ దుఃఖం ఉన్న బుద్ధుడిలా గి’ తోచిన సాయం చేస్తాడు. అతడు ‘ప్రజల మనిషి’ అతడంటే దుష్టులకు కసి అబద్దాసురుని పాలిటి తల్వార్, ఆర్వల్ ఆనందరణికి షల్వార్ ఆళ్వార్ అన్నరు. 24-8-1976లో ‘జనపదం’ నవలను ఆళ్వార్ స్వామికి అంకితం ఇచ్చారు. డాక్టర్ దాశరథఇ రంగాచార్య, సామాజిక ఉద్యమమోధుడిగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా, రచయితగా, గ్రంథాలయోద్యమకారుడుగా వట్టికోట ఆళ్వారుస్వామి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం, అనుసరణీయం.
(1915 – 1961)

kolanupaka_kumaraswamy

కొలనుపాక కుమారస్వామి, వరంగల్.
మొబైల్: 9963720669

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *