పట్టాలెక్కుతున్న ట్రైన్స్

పట్టాలెక్కుతున్న ట్రైన్స్
  • రైళ్ల రాకపోకలు షురూ..
  • 4 రోజులుగా నిర్విరామ కృషితో రైల్వే ట్రాక్ పునరుద్దరణ
  • భారీ యంత్రాలుతో రాత్రి పగలు పనులు
  • యుద్దప్రాతిపదికన పనుల పూర్తి

వాయిస ఆఫ్ భారత్ ( తెలంగాణ న్యూస్):  రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో కేసముద్రం మండలం ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకు పోయి నాలుగు రోజులపాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన స్పందించి పునరుద్దరణ చర్యలు చేపట్టారు. బుధవారం ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ కు మరమ్మత్తు పనులు పూర్తి చేసి డౌన్ లైన్ ( విజయవాడ వైపు వెల్లే ) సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ ను పంపించి ట్రయల్ రన్ ను నిర్వహించారు. నిన్న తాళ్ల లపూసలపల్లి….ఈ రోజు ఇంటికన్నె వద్ద రైల్వే శాఖ నిర్వహించిన ట్రయల్ రన్ లు విజయవంతం కావడంతో రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో వరద విలయ తాండవం సృష్టించి మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె రైల్వే స్టేషన్ శివారులో 418 కిలో మీటరు మైలు రాయి వద్ద 42 మీటర్ల పొడవున రైలు పట్టాల కింద కంకర కొట్టుకు పోయి పట్టాలు గాలిలో తెలియాడాయి. వెంటనే రైల్వే శాఖ సిబ్బంది అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది.

యుద్ద ప్రాతిపదికలన పనుల పూర్తి

రైల్వే శాఖ సిబ్బంది నాలుగు రోజులుగా రైలు పట్టాల మరమ్మతు పనులను 8 ఎక్స్ వేటర్ లు, భారీ జేసీబీ లు ఇతర యంత్రాలతో వేయి మంది సిబ్బంది రాత్రి… పగలు తేడా లేకుండా వర్షంలో ట్రాక్ మరమ్మతుల పనులు పూర్తి చేసి ట్రాయల్ రన్ నిర్వహించారు. ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్స్ విభాగం విద్యుత్ సరఫరా లైన్ పనులు, కమ్యూనికేషన్స్ తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు.
మరి కొన్ని గంటల్లో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఉత్తర…దక్షిణాలను కలిపే రైలు మార్గం కావడంతో రాకపోకలు స్తంభించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆగస్టు 31 వ తేదీ అర్ధరాత్రి భారీ వర్షానికి వరద ప్రవాహం పెరగడంతో ట్రాక్ మెన్లు అప్రమత్తమై కేసముద్రం రైల్వేలో రెండు సంగమిత్ర రైళ్లు , మహబూబాబాద్ రైల్వే మచిలీపట్నం, సింహపురి రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *