నేడు భీష్మ ఏకాదశి
అష్టవసులు వశిష్టుని శాపం వలన భూలోకంలో మానవులుగా జన్మించినారు. వారిలో ఒకడే భీష్ముడు. ఎవరైనా ప్రతిజ్ఞ చేస్తే భీష్మ శబదం అంటారు. జన్మనిచ్చిన తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహా మహుడు భీష్ముడు, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి మహాభారతంలో భీష్మ పితామహుడిగా పేరు గడించాడు, ఇచ్చిన మాట కోసం తన గురువైన పరుశురామున్ని యుద్ధంలో ఎదిరించిన మహావీరుడు, తనకు కావలసినప్పుడు మరణాన్ని పొందే వరం పొందిన వారిలో భీష్ముడు ఒకరు, శ్రీకృష్ణునికి మహా భక్తుడు అందుకే నారాయణునికి ఇష్టమైన ఏకాదశతిథులలో మాఘ శుక్ల ఏకాదశి నాడు ఆయన నారాయణుడిలో ఐక్యం చెందినాడు, అందుకే ఈ రోజును భీష్మ ఏకాదశిగా చెప్పుకుంటాము, అంతేకాకుండా ఈ ఏకాదశికి జేయేక ఏకాదశి, విజయ ఏకాదశి అని కూడా పిలుస్తారు.
విష్ణు సహస్ర నామ కర్త, భీష్ముడు. మాఘ శుక్ల ఏకాదశి నాడు భీష్ముడు విష్ణు సహస్ర నామ స్తోత్రం శ్రీకృష్ణునికి వినిపించాడు. అదే రోజు పరమాత్మలో ఐక్యమయ్యాడు
ఈరోజు భీష్ముడిని తలుచుకుంటే అన్ని విజయాలు కలుగుతాయని ప్రతిదీ.
భీష్ముడి చరిత్ర :
భీష్ముడు కారణజన్ముడు జన్మించాడు. వశిష్టుని శాపం వలన భూలోకంలో మానవునిగా జన్మించిన అష్టవసులలో భీష్ముడు ఒకరు, అతనితో పాటు జన్మించిన ఇతరులకు గంగ స్వయంగా ముక్తి ప్రసాదించింది. కాని భీష్ముడొక్కడే సంసార కూపంలో చిక్కుపడిపోయాడు. గంగకు మార్త్యలోకం పోవలసిన అవసరమేర్పడింది. దాదాపు అదే సమయంలో అష్టవసువులు వశిషుఠని శాపవశాత్తు మర్త్యలోకంలో జన్మించవలసి వచిచంది. వారు ఓ గంగా మేమే నీ గర్భవాసాన జన్మస్తాము. జన్మించగానే మమ్ములను అంతమొందించి మాకు ముక్తి ప్రసాదించు అని గంగను వేడుకున్నారు. గంగా వారికి అలాగే వాగ్దానం చేసింది. ఆమె ‘దేవతా’ స్త్రీ కనుక మర్త్యలోక నియమాలు ఆమెకు వర్తించవు. ఆమె భూలోకానికి వచ్చి సరాసరి ప్రతీపుడనే రాజు ఒడిలో కూర్చొని నన్ను పెళ్ళి చేసుకోమ్మని అడిగింది. ఆ రాజు అన్నాడు. ‘అమ్మ’ నాకు భార్యగా ఉండగోరిన దానినయితే నా డమ తొడమీద కూర్చొని డవలసినది. నీవు నా కుడి తొడమీద కూర్చున్నావు. అది (ఆ స్థానం) కొడుకుది లేకపోతే కోడలిది. కనుక నాకు కొడుకు పట్టనీ నిన్ను వివాహమాడమని అతనికి చెప్పగలము. గంగా దానికి ఒప్పుకొన్నది. ప్రతీపునికి శంతనుడు కలిగాడు. ప్రతీపుడు తన రాజ్యం శంతనుడికి అప్పగించి వెళ్ళిపోయాడు. ఒకసారి శంతనుడికి గంగాతీరంలో అనుపమ సౌందర్యరాశి అయిన ఒక స్త్రీ కనిపించింది. శంతనుడే ఆమెచే వేటాడబడ్డాడు. ఆ స్త్రీ గంగయే. శంతనుని వావాహమాడి అతనికి భార్యగా ఉండడానికి అంగీకరించింది. కాని ఆమె కొనిన విచిత్రమయిన షరతులు పెట్టింది. రాజా నా యిచ్చ వచ్చిన పనులు చేస్తాను. నీకు అయిష్టంగా తోచే పనులు కూడా చేస్తాను. కాని నీవు నన్ను అడ్డు పెట్టడానికి వీలు లేదు. నన్ను వేలెత్తి చూపెట్టడానికి వీలులేదు. నీవు అలా చేసిన రోజున నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. శంతనుడు అవన్నీ ఒప్పుకున్నాడు. అని మహాభారతం చెబుతున్నది. పిల్లవాడు పట్టిపట్టగానే ఆమె వాడిని గంగలో ముంచి వేసింది. ఆమె వ్యామోహంలో పడ్డ శంతనుడు పల్లెత్తు మాటయినా అనలేక పోయేవాడు కాని ఎనిమిదవ పిల్లవాణ్ని గంగలో ముంచి పారవేయడానికి బయలు దేరినప్పుడు చూస్తూ ఊర్కోలేక పోయాడు. కనీసం వీణ్నయినా చంపవద్దు. ఎటువంటి ఘోరకృత్యాలు చేసే స్త్రీవి నీవు అని అన్నాడు. ఇంకేముంది గంగకు ఆ మాట చాలు ఈ పిల్లవాణ్ని ప్రాణాలతో విడిచి పెడతాను. కాని నా షరతు ప్రకారం నిన్ను విడిచిపెడతాను. అని పిల్లవాన్ని తీసుకొని ఆమె అంతర్ధానమయి పోయింది. పిల్లవాడు తల్లి లేకుండా పోయాడు. భార్య లేకుండా పోయింది. శంతనుడు మళ్ళీ వేటకు వెళ్లాడు, వ్యామోహంతో అడవుల్లో తిరుగాడుతూ యుక్త వయస్కుడూ అయిన అతని కుమారుణ్ణి గంగ అతడికి అప్పగించింది. శంతనుడు ఆ కుమారుణ్ణి రాజధానికి తీసుకొచ్చి యౌవ రాజ్య పట్టాభిషేకం చేశాడు. ఆ దేవవ్రతుడు తన గుణగణాలచే సర్వజనులకు ప్రియంకరుడయినాడు. హృత్యువుచే విముక్తుడుగాకుండా, ఆ జీవుడు ఈ లోకంలే చిక్కు పడిపోయాడు. ఒక పురాతన రాజ్య వంశానికి యువరాజయినాడు. శంతనుడు మళ్లీ ఒక సుందరి వల్లో చిక్కుకున్నాడు. ఈసారి ఆమె కాదు. ఆమె తండ్రి వారి వివాహానికి కొన్ని షరతులు పెట్టాడు. ఈ షరతులన్నీ మానవ సహజాలూ లోక వ్యవహారానికి సంబంధించినవే. వాటి వలననే దేవవ్రతుడి జీవితంలో మళ్ళీ ఒక మలుపు వచ్చింది. ‘నాయీ పుత్రికకు పుట్టే సంతానానికి రాజ్యాధికారం కలిగిస్తేనే నా పుత్రికను ఇస్తాను. దాశరాజు పెట్టిన ఈ షరతును శంతనుడు అంగీకరించ లేకపోయాడు. భిన్నుడయిన అతడు రాజధానికి మరిలిపోయాడు. అతని మనస్థితిని గురైరగడానికి దేవవ్రతుడు ప్రయత్నించాడు. శంతనుని జవాబు కూడా అతి విచిత్రమైంది. ‘నీలాంటి గుణవంతుడయిన కొడుకు రాజ్యభారం వహించడానికి ఉండగా నాకేం చింతఝ అయితే నీవు ఒంటరి వాడవనీ. నీకేమయినా అయితే రాజ్యంగతి ఏమవుతుందనేదే నా భయం’. రాజకుమారుడు ఇతర రాజపురుషుల వద్దకు వెళ్ళి అన్ని సంగతులు తెలుసుకున్నాడు. ఆ తరువాత శంతనుడితో చెప్పకుండానే అమాత్యులను, తర కులవృద్ధులను వెంటబెట్టుకొని, దాశరాజు వద్దకు వెళ్ళాడు. శంతనుడి కొరకై సత్యవతిని అభ్యర్థించాడు. దాశరాజు తన షరతును గురించి చెప్పాడు. అందరిముందు దేవవ్రతుడు నేను సింహాసనం మీద కూర్చోను అని ప్రతిజ్ఞ పూనాడు. కాని దీని వలన దాశరాజుకు సంతృప్తి కలగలేదు. సరే కాని నీ సంతానం నా దేహిత్రులతో జగడానికి దిగ వచ్చును గదా దానికేం చెబుతావు? మాటవిని రాజకుమారుడు ‘నేను యావజ్జీవితం బ్రహ్మచారిగానే ఉండిపోతాను’ అని మొదటి దాని కంటే కఠోరమయిన ప్రతిజ్ఞ చేశాడు. కఠోర ప్రతిజ్ఞ మూలంగానే దేవవ్రతుడికి భీష్ముడనే పేరు కలిగింది. దాశరాజుకు సంతోషం కలిగింది. అతను ‘గంధకలి’ని తన పుత్రికను దేవవ్రతు భీష్మునికి అప్పగించాడు. ‘అమ్మా పద’ అని భీష్ముడు ఆమెను రథమెక్కించాడు. ఇలా భీష్ముడు సర్వసరిజనులతో రాజధానికి వచ్చి శంతనుడి వివాహం జరిపించాడు. అసాధారణమయిన ఈ త్యాగం వలన సంతృప్తుడయి తండ్రి భీష్మునికి ఇచ్చా మరణమనే వరాన్ని ప్రసాదించాడు. పుట్టి పుట్టగానే విముక్తుణ్ణవుదామనే అభిలాషతో ఈ లోకంలో ప్రవేశించి చిక్కుపడిపోయిన ఈ జీవుడు ఈ సంసార జంబాలంలో ఇంకా చిక్కుపడకుండా ఉండడానికి మంచి అవకాశాన్ని చేజిక్కించుకోలేదు గదా. రాజ్యమూ లేదు. వివాహమూ లేదు. పైపెచ్చు ఇచ్చా మరణం. ఈ మూడు విషయాలను బట్టి చూస్తే ఈ ప్రపంచం నుండి విముక్తుడవడానికి భీష్ముడిని ఎటువంటి ఆటంకము లేకుండా పోయింది. ఫంజరంలో బంధించబడ్డ పక్షికి ఎగిరిపోయే మార్గం లభించింది. కానీ భీష్ముడు వెన్నంటి జన్మించిన అతని ప్రాబ్దం అతనికి మళ్ళీ గుడిబండ అయింది.

కొలనుపాక కుమారస్వామి, వరంగల్.
మొబైల్. 9963720669
