నియోజకవర్గం ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్..
– పూలను,ప్రకృతిని దైవంగా భావించే గొప్ప పండుగ బతుకమ్మ.
– మానవ జీవన విధానానికి ఈ పండుగ నిదర్శనం
వాయిస్ ఆఫ్ భారత్, హుజురాబాద్ :పూలను దైవంగా భావిస్తూ ప్రకృతిని కాపాడుతూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని,ఎంగిలిపూలతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు తీరొక్క పువ్వులను పూజిస్తూ జరుపుకుంటారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని ఇక్కడ జరుపుకునే బతుకమ్మ పండుగ చిన్న,పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఆనందంగా జరుపుకుంటారని అన్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని,ప్రతి ఒక్కరూ ఆనందంగా,ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
