నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు భోగి పండుగను తన సొంత గ్రామం అయిన నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం సతీమణి నారా భువనేశ్వరి గ్రామంలోని మహిళలకు ముగ్గుల పోటీలు, బాలికలకు, బాలురకు వివిధ పోటీలు నిర్వహించింది. ఈ క్రమంలో పిల్లలకు నిర్వహించిన పోటీల్లో సీఎం మనువడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ కూడా పాల్గొన్నాడు. స్నేహితులతో కలిసి దేవాన్ష్ సరదాగా ఆడటాన్ని చేసిన తల్లి నారా బ్రాహ్మిణి, సీఎం చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి ఆనందంతో ఉప్పొంగి పోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో సీఎం మనవడు నారా దేవాన్ష్ స్నేహితులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ.. ఆడుకుంటున్న సన్నివేశాలు స్పష్టంగా కనిపించారు.
