నరసింహస్వామి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం
కంబాలపల్లి నరసింహస్వామి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం
వాయిస్ ఆఫ్ భారత్ (రూరల్ న్యూస్):
ప్రతి సంవత్సరం మార్చి మాసంలో వచ్చే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు బయ్యారం మండలంలొని పాత కంబాలపల్లిలో ఆదివారం ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా కంబాలపల్లి గ్రామంలో యువకులువాలీబాల్ పోటీలు నిర్వహించారు.ఈ పోటీలో గెలుపొందిన వారికి ఎంపిటిసి సనప సోమేశ్ చేతుల మీదుగా పదివేల రూపాయల మొదటి బహుమతి ఇవ్వడం జరిగింది. వివిద ్రగామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మణరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్, రాజు, గోపాల్ ,తాటి లక్ష్మీనారాయణ, మనోహర్ ఆలయ కమిటీ క్రీడాకారులు పాల్గొన్నారు
