తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ/Bathukamma is a symbol of Telangana culture.
డీసీసీబీ చైర్మన్ రవీందర్‌రావు
ఘనంగా డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : పూలను దేవతలుగా భావించి జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణకు ఒక ప్రత్యేక సంస్కృతి అని తెలంగాణ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు (టీజీ క్యాబ్) & డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు అన్నారు. గురువారం వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) ప్రధాన కార్యాలయంలో మహిళా ఉద్యోగులు నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని, రంగురంగుల పువ్వులను కీర్తిస్తూ బతుకమ్మను జరుపుకుంటారని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, ఇది ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందని అన్నారు. దసరా నవరాత్రుల వేళ తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో గౌరీదేవిని పూజించే పూల సంబురమని రవీందర్‌రావు పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులందరూ ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరుతూ ముందుగానే విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈవో ఎండీ వజీర్ సుల్తాన్, జీఎంలు ఉషాశ్రీ, పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు గొట్టం స్రవంతి, గంప స్రవంతి, మధు, కృష్ణమోహన్, రాజు, ఇతర బ్యాంకు ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు.

