తూకంలో మోసం

తూకంలో మోసం
  • పత్తి కాంట ప్రైవేట్ దందా జోరు
  • పట్టించుకోని అధికారులు

(వాయిస్ ఆఫ్ భారత్ న్యూస్) ములుగు జిల్లాలో అనుమతులు లేకుండా కొందరు వ్యాపారులు తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేయడంతోపాటు తూకంలో మోసం చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. ఆరుకాలం కష్ట పడి పండించిన పత్తి పంటకు ప్రైవేటు వ్యాపారులు ఇష్టం వచ్చిన రేటుకు కొనుగోలుచేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దూకంలో రెండు నుంచి మూడు కిలోల వరకు మోసం జరుగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. పెట్టుబడి కోసం వ్యాపారులనుంచి అప్పులు చేసి పండించిన పట్టను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులకు అప్పులు తప్ప ఆమ్దాని రావడం లేదంటున్నారు. రైతుల ఇబ్బందులను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వ్యాపారులు ఇష్టా రాజ్యంగా జిల్లాలో జోరుగా పత్తి కొనుగోలు చేస్తున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రైవేట్ వైపారులతో జిల్లా కేంద్రంలోని పత్తి మిల్లుల యజమానులు కుమ్మకై తక్కువ ధరకు రైతులనుంచి కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు మిల్లర్లకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలతో ప్రైవేట్ దందా చేస్తూ రైతులను నిండా ముంచుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *