ఘనంగా వసంత పంచమి వేడుకలు
వాయిస్ ఆఫ్ భారత్ (కల్చరల్ న్యూస్): హనుమకొండ కిషన్ పుర వాగ్దేవి కళాశాలలోని సరస్వతి దేవి ఆలయంలో బుధవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు నాగిళ్ల శరత్ కుమార్ శర్మ, మాఢభూషిణి వెంకటరమణాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు నవరస సహిత అష్టోత్తర శత కలిశ అభిషేకం, ఉదయం 7.30 గంటల నుంచి అక్షరాభ్యాసం, కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సరస్వతి సహస్ర పుష్పార్చన జరిగింది. భక్తి శ్రద్ధలతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

