ఘనంగా ధనైరా సిల్క్స్ షోరూం ప్రారంభం
హాజరైన సీరియల్ ఫేమ్ సుహాసిని
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : మహిళలకు అవసరమైన సరికొత్త వేరైటిలతో కూడిన పట్టు సిల్క్స్ సారీలు అందుబాటులో కి వచ్చాయని సీరియల్ ఫేమ్ సుహాసిని అన్నారు. సుబేదారి ఎస్ బీహెచ్ కాలనీలోని వంగల దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధనైరా సిల్క్స్ షోరూంను బుధవారం సీరియల్ ఫేమ్ సుహాసిని ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా సీరియల్ ఫేమ్ సుహాసిని మాట్లాడుతూ వరంగల్ నగరానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ధనైరా సిల్క్స్ షోరూంలో నగర ప్రజలకు సరైన వేరైటీలతో కూడిన కొత్త డిజైన్ లతో పట్టు, వెడ్డింగ్, బెనారస్, ఫ్యాన్సీ సారీలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. 10 వేల రూపాయలు కొనుగోలు పై నాలుగు గ్రాముల వెండి నాణెం ను ఉచితంగా ఇస్తున్నారన్నారని, అలాగే 20 వేల రూపాయలు కొనుగోలుపై ఎనిమిది గ్రాముల వెండి నాణెంను ఉచితంగా ఇస్తున్నారన్నారని అలాగే 50 వేల రూపాయలు కొనుగోలుపై 20 గ్రాముల వెండి నాణెంను ఉచితంగా ఇస్తున్నారన్నారని అన్నారు.నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధనైరా సిల్క్స్ షోరూంను అన్ని నగరాలలో ప్రారంభించాలని సూచించారు. అనంతరం అభిమానులతో సందడి చేశారు. ఈ కార్యక్రమం లో ధనైరా సిల్క్స్ షోరూం యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
