గడ్డి మందు తాగిన ఇద్దరికి ప్రాణదానం
మెడికవర్ క్రిటికల్ కేర్ వైద్యుల ఘనత
వాయిస్ ఆఫ్ భారత్ , హనుమకొండ : అత్యాధునిక వైద్య సేవలను అందిస్తూ, అనుభజ్ఞులైన డాక్టర్స్ కలిగిన మెడికవర్ హాస్పిటల్స్ లో గడ్డి మందు తాగిన వారిని సరైన సమయంలో తీసుకోని వస్తే ఆధునిక వైద్యం అందించి వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. బుధవారం మెడికవర్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ ఇటీవల ఇద్దరు వ్యక్తులు రవి(36), వెంకన్న (23) కొన్ని అనివార్య కారణాలతో 50ఎంఎల్ పైన మోతాదులో గడ్డి మందుని తాగడం జరిగింది. చాలా క్లిష్టమైన పరిస్థితిలో, సృహ తప్పి పడిపోవడం వల్ల కుటుంబసభ్యులు వెంటనే వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగానికి తీసుకొచ్చారు. వైద్య బృందం వెంటనే ఇంట్యూబేషన్ ద్వారా వాయుమార్గం ప్రభావితం కాకుండా చికిత్స అందిస్తూ, టాక్సిన్ శోషణను తగ్గించడానికి యాక్టివేటెడ్ చార్కోల్తో గ్యాస్ట్రిక్ లావేజ్ చేయడం జరిగింది. ఇది విషపూరితమైన సందర్భాల్లో టాక్సిన్ శోషణను తగ్గించడానికి ఉపయోగించే ఒక వైద్య విధానం. గ్యాస్ట్రిక్ లావేజ్‌లో కడుపుని కడగడం, రక్తప్రవాహంలోకి వాటి శోషణను నిరోధిస్తుంది. హెమోపెర్ఫ్యూజన్, హిమోడయాలసిస్తో సహా అధునాతన చికిత్స ప్రోటోకాల్‌ను అందించడం మరో పక్క ఏమైనా అవయవాల మీద ప్రభావితం చేస్తాయేమో అని నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందించడం జరిగింది. అనంతరం పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ చేశారు. అనంతరం క్రిటికల్ కేర్ వైద్యవిభాగం డాక్టర్స్ మాట్లాడుతూ సరైన సమయంలో ఆరు గంటల వ్యవధిలోపు కనుక తీసుకొనిరాగలిగితే మా వైద్య బృందం హిమోపేర్ఫుషన్ అనే ప్రక్రియ ద్వారా శరీరం, ఇతర అవయవాల మీద విషప్రభావం పడకుండా అన్ని చర్యలు తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్ కుమార్ జోగు-కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, డాక్టర్.లక్ష్మి దీపక్ -కన్సల్టెంట్ క్రిటికల్ కేర్, డా.ప్రదీప్ రాజన్న-కన్సల్టెంట్ ఎమర్జెన్సీ, మెడిసిన్, డా.అరుణ్ కుమార్ దర్నా-కన్సల్టెంట్ ఫిజీషియన్ పాల్గొన్నారు.
