కొయ్యి కోయంగానే.. కోడికూత మానేసి..
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీరు వింటున్నారు జానపద గేయాలు, తదుపరి గేయం కొయ్యి కోయంగానే.. కోడికూత మానేసి..
పాడినవారు .. రచన.. సంగీతం…. కొయ్యి కోయంగానే.. కోడి కూత మానేసి కైలాసం వెళ్ళినానంటదే.. ఆ మాటలు అంటదే.. అలాగనంటాదే.. కోడి పిల్లా..
ఈ జానపద గేయం అప్పట్లో చాలా పాపులర్.
బహుశా ఈ తరం వారికి ఈ అనుభూతి తెలిసి ఉండదు, నా చిన్నప్పుడు సెల్ ఫోన్లు, టీవీలు రాని కాలంలో రేడియోలదే రాజ్యం.. దినచర్య కూడా రేడియో కార్యక్రమాల తోటే ప్రారంభం అయ్యేది. తెల్లవారుజామున సుప్రభాతం మొదలు తరంగిణి కదంబ కార్యక్రమం, వార్తలు, కార్మికుల కార్యక్రమం, పాడిపంటలు, జానపద గేయాలు, ఆదివారమైతే బాలానందం, నాటికలు, కీర్తనలు సంగీత కార్యక్రమాలు, సినిమా పాటలు, సిలోను కార్యక్రమాలు. రేడియోలో వింటుంటే అదొక మధురానుభూతిగా ఉండేది. ముఖ్యంగా ఢిల్లీ నుంచి హిందీ సినిమా పాటలు, పాత సినిమా పాటలు వింటూ ఉండేవాళ్ళము, అలా వింటూ వింటూ చాలా పాటలు కంటతవచ్చేవి.. ఆరోజు కార్యక్రమాలు అయిపోగానే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం, తిరిగి రేపు ఉదయం సుప్రభాతంలో కలుసుకుందాం, ఓవర్ టు ఢిల్లీ..
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. కోడిని చూసినప్పుడల్లా.. కోడికి మనిషికి తేడా లేదనిపిస్తుంది, బహుశా ఒకప్పుడు నెమ్మిళ్ళ లాగానే కోళ్లు కూడా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరేవేమో అనిపిస్తుంది.. నేమల్లే ఇప్పటికి కూడా అడవులలో పురుగు పుట్టరా వేరుకుంటూ స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. కోల్లే చికెన్ సెంటర్లో దూరాయి. మనిషికి ఆహారంగా మారాయి, వారంలో ఒక రోజైనా చికెన్ లేనిదే ముద్దబోదు, ఇది కాదని, బ్రతకడానికి తినేవారు కాకుండా, తినడానికే బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లలో చికెన్ ప్రియులు చాలా ముఖ్యులు, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ.. అన్నిటికీ కోడి కంటెంట్ గా మారింది, ఈ దుస్థితి కోడికి ఎందుకు వచ్చింది, మనిషి వేసే నాలుగు గింజలకు ఆశపడి కోడి భూమి మీద సెటిల్ అయిపోయింది, ఉచితంగా వస్తుంది కదా అని తన సహజ సిద్ధమైన ఎగిరే స్వభావాన్ని, ఆహారాన్ని అన్వేషించే స్వభావాన్ని కోల్పోయి భూమి మీద గింజలు ఏరుకుంటూ బతక సాగింది. అలా రాను రాను పూర్తిగా ఎగరలేని స్థితికి చేరుకుంది, ఇప్పుడు మనిషికి ఆహారంగా మారింది.
ఇప్పుడు మనుషుల పరిస్థితి కూడా ఇలాగే మారిపోతుంది. రాజకీయ పార్టీలు అధికారమే ఎజెండాగా.. అధికారం కోసం వెంపర్లాడుతూ, సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా, అమలుకు సాధ్యం కానీ ఎన్నో ఉచిత పథకాలను హామీలుగా ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓటు బ్యాంకింగ్ పెంచుకొని అధికారంలోకి వస్తున్నారు. ఐదు ఏండ్ల లో అది చేస్తాం ఇది చేస్తామంటూ కాలం వెళ్లబుచ్చుతారు, మొదటి అయిదేళ్లు సరిపోలేదని మరో ఐదు ఏళ్ల అవకాశమిస్తే పూర్తిస్థాయిలో హామీలు అమలు చేస్తామని మళ్లీ అధికారంలోకి వస్తారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఈ కాలంలో ఎంత దండుకోవాలో అంత దండుకుని ప్రజలను గాలికి వదిలేస్తారు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. ప్రజలు విసిగి పోయి ఈసారి ఎక్కువగా ఉచిత హామీలు ఇచ్చిన పార్టీకి అవకాశం ఇస్తారు. మళ్లీ కథ మొదటికి.. ఉచిత పథకాల ఆశకు అలవాటు పడిన మనుషులకు రాజకీయ నాయకులకు ఓటర్లు ఎప్పుడు బకరాలు గానే కనబడతారు, కోళ్లు ఉచితంగా వచ్చే నూకలకు ఆశపడి ఏ విధంగా బలైపోయాయో.. మనుషులు ఉచితలకు అలవాటు పడి రాజకీయ నాయకులకు బలైపోతున్నారు. ఇప్పుడు చెప్పండి కోడికి మనిషికి తేడా లేదంటారా..
– వాయిస్ ఆఫ్ భారత్ (జిందగీ)
