కాంగ్రెస్‌లో చేరిన షర్మిల
(వాయిస్ ఆఫ్ భారత్ న్యూస్) ఎట్టకేలకు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. షర్మిల చేరికతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనమైంది. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీని విలీనం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా షర్మిల చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతో పనిచేస్తానని షర్మిల స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రుద్రరాజు, పలువురు నేతలు పాల్గొన్నారు.
