ఎన్టీఆర్ నెగటివ్ షేడ్‌లో వార్ 2/NTR in a negative shade in War 2
మే 20న టీజర్ విడుదల
వాయిస్ ఆఫ్ భారత్, సినిమా : బాలీవుడ్లో సంచలన విజయాన్ని సాధించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘వార్’కి సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం ‘వార్ 2’. 2019లో విడుదలైన మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు, ఈ సీక్వెల్‌ను మరింత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు స్టార్ హీరో ఎన్టీఆర్ తెరంగేట్రం చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న మొదటి ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు యశ్ రాజ్ ఫిలిమ్స్ వహించాయి.
ఇతర హీరోల మాదిరిగా కాకుండా, ఎన్టీఆర్ ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఇది పూర్తిగా విలన్ పాత్ర కాదని, గ్రే షేడ్స్‌తో కూడిన డైనమిక్ క్యారెక్టర్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త లుక్‌తో తెరపై ఎన్టీఆర్ ఎలా మెరవనున్నాడన్నది ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను మే 20న, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని యూనిట్ సిద్ధమవుతోంది. ఈ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
