ఉపాధి హామీ కూలీలు ఆవేదన

ఉపాధి హామీ కూలీలు ఆవేదన

ఉపాధి హామీ కూలీలు ఆవేదన

వాయిస్  ఆఫ్  భారత్ ( బయ్యారం లోకల్ న్యూస్ )

ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం నత్త నడక నడుస్తూ ఉపాధి కూలీలకు కనీస వేతనం కూడా వచ్చే పరిస్థితి లేదు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలైన మంచినీరు. నీడ. వైద్య కిట్టు. గడ్డపార. తట్ట.పారలు కూడా సప్లై చేయడం లేదని. రోజు వేతనం కూడా 50 రూపాయల నుండి.100 రూపాయలకు మించడం లేదని. వేతనాలు వార. వారం ఇవ్వకుండా ఆరు వారాలు గడిచిన ఇవన్నీ పరిస్థితి ఉందని వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం వలన అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని  అఖిలభారత రైతు కూలీ సంఘం బయ్యారం మండలంలోని బాలాజీ పేట. వెంకట్రాంపురం పని ప్రదేశాల్లో పరిశీలనకు వెళ్లిన సందర్భంగా ఉపాధి కూలీలు తమ గోడును వెల్లబుచ్చారని అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు. సంఘం మండల ప్రధాన కార్యదర్శి తోకల వెంకన్నలు అన్నారు. ఈ సందర్భంగా నందగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి కూలీలు తమ జీవన భృతి కోసంమండుటెండల్లో పనిచేస్తున్న వారికి కనీస వేతనాల చట్టం ప్రకారం రోజు కూలి ఇవ్వడంలేదని పని ప్రదేశాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడంలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. అధికారం కోసమే అరాటపడుతూ అనేక వాగ్దానాలు చేస్తున్న పాలకులు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా. కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ. ఉపాధి కూలీలకు కనీస వేతన చట్టం ప్రకారం కొలతలతో సంబంధం లేకుండా రోజు కూలి 750 రూపాయలు ఇవ్వాలని. పని ప్రదేశాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని. జాబు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ₹200 రోజులు పని కల్పించాలని. పథకంలో పనిచేస్తున్న ఎన్.ఎం.ఎం.ఎస్ ల నుండి పిఓల వరకు అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పిఎఫ్. ఈఎస్ఐ. పిఆర్సి ని అమలు చేయాలని. పెండింగులో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని. రద్దు చేసిన అలవెన్స్లను పునరుద్ధరించాలని. వారానికి ఒకసారి మస్టర్ల స్లిప్పులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర మురళి. కొత్త రామదాస్. దీకొండ వెంకటరమణ. పోతుల నిరోషా. ఉప్పరపల్లి మల్లేశం కొమ్మినేని వెంకన్న. బొల్లం సోమక్క. కమటం వినోద. రావుల వెంకన్న. అత్తునూరి లక్ష్మి. పోలేబోయిన అనసూర్య. రావుల వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *