ఆన్‌లైన్ గేమ్‌కు యువకుడి బలి/Young man sacrificed for online game

ఆన్‌లైన్ గేమ్‌కు యువకుడి బలి/Young man sacrificed for online game
@@####Young man sacrificed for online game@@@##

తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య

వాయిస్ ఆఫ్ భారత్, జగిత్యాల : ఆన్‌లైన్ గేమ్‌కు బానిసై, తల్లిదండ్రులు మందలించారన్న మనస్తాపంతో జగిత్యాల పట్టణంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పట్టణంలో విషాదాన్ని నింపింది. విద్యానగర్‌కు చెందిన రాహుల్ (22) అనే యువకుడు బీటెక్ చదువు మధ్యలోనే ఆపేసి, ఇంట్లో ఖాళీగా ఉంటూ నిత్యం ఆన్‌లైన్ గేమ్‌లకు అంకితమయ్యాడు. కొడుకు భవిష్యత్తుపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు, అతడిని గేమ్స్ ఆడటం మానుకోవాలని పలుమార్లు మందలించారు. ఈ మందలింపుతో తీవ్ర మనస్తాపానికి గురైన రాహుల్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మంచి కోరి మందలిస్తే ఇలాంటి దారుణానికి పాల్పడటం తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చింది. ఇటీవలి కాలంలో జిల్లాలో ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కళ్ల ముందు పెరిగిన కొడుకులు ఇలాంటి చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడటం సమాజంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువత ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, తల్లిదండ్రులు వారిని సరైన మార్గంలో నడిపించాలని పలువురు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *