అవని జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే/Freshers’ Day celebrated at Avani Junior College
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : భీమారంలో గల అవని జూనియర్ కళాశాలలో బుధవారం ‘ఆరోహన్’ పేరుతో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులను స్వాగతించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు సిద్ధం..
కార్యక్రమాన్ని ప్రారంభించిన ‘ఆరోహన్’ ఛైర్మన్ జక్కుల శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులను జాతీయ స్థాయిలో ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే తమ కళాశాల లక్ష్యమని తెలిపారు. కళాశాల కార్యదర్శి బొంపల్లి రాము మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. వారి అవసరాల కోసం అన్ని వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు.
లక్ష్య సాధనకు పట్టుదల ముఖ్యం..
ముఖ్య అతిథిగా హాజరైన జక్కుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఈ దశ అత్యంత కీలకమైనదని అన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని చేరుకోవడానికి పట్టుదల, శ్రమతో కృషి చేయాలని కోరారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం, విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ తోట రఘు, అంబరగంటి సంతోష్, ఎర్ర రమేష్, జుంకం దయాకర్, పాలమరుపాల రాజు, రాజకుమార్, జక్కుల యకాంత్, గుండెకారి రాజుతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
