అలరిస్తున్న ఎగ్జిబిషన్-2025
ప్రత్యేక ఆకర్షణగా లేజర్ అండ్ మ్యూజికల్ ఫౌంటైన్
స్వాగతం పలుకుతున్న మైసూర్ ప్యాలెస్ ముఖద్వారం
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొడ : వరంగల్ మహ నగరంలో లేజర్ అండ్ మ్యుజికల్ ఫౌంటైన్ ఎగ్జిబిషన్-2025 ఆహుతులను అలరిస్తోంది. చిన్నారులు, పెద్దలను అందరిని ఆకర్షించేలా హనుమకొండ కుడా మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వసతులు కల్పించారు. మహనగరంలో మొట్టమొదటి సారిగా మైసూర్ ప్యాలెస్ ముఖద్వారంతో లేజర్ షో అడ్ మ్యుజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేయడంతో పిల్లలు, వారి తల్లిదండ్రులు సందర్శించి అద్భుతమైన మదురాభూతిని పొందుతున్నారు. పిల్లలకు మరింత ఎక్సైట్మెంట్, పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులందరికి సరదానుభూతి ఇచ్చే ఎమ్యూస్మెంట్ ఎగ్జిబిషన్ ఇప్పడు అందరిని రా..రా.. రమ్మంటూ పిలుస్తోంది. మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కళంకారి బెడ్ షీట్స్ , హ్యాండీ క్రాఫ్ట్, జ్యూవెల్లరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, మొదలైన వెరైటీలతో ఏర్పాటు చేసి స్టాల్స్ ఇక్కడి పత్యేకత. ఇంకా కొలంబస్, జెంట్ వీల్, క్రాస్ వీల్, బ్రేక్ డ్యాన్స్, డెవిల్ హౌజ్వంటి అనేక రకాల ఎమ్యూజ్మెంట్ పిల్లలను ఆనందానుభూతులకు లోను చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కుటుంబ సమేతంగా విచ్చేసి ఇక్కడ సంతోషంగా గడపడానికి ఎగ్జిబిషన్ మేళా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
