అరుణ్ ఐస్ క్రీమ్స్ సరికొత్త రికార్డు

అరుణ్ ఐస్ క్రీమ్స్ సరికొత్త రికార్డు
@@@###Arun Ice Creams sets new record@@@###

చైర్మన్ ఆర్.జి. చంద్రమోహన్
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్/గోవిందపూర్ : హాట్సన్ అగ్రో ప్రోడక్ట్ లిమిటెడ్ ఐస్ క్రీమ్స్ బ్రాండ్ అయిన అరుణ్ ఐస్ క్రీమ్స్, గోవిందపూర్ ఫెసిలిటిలో రోజుకు 1.27 లక్షల కిలోల ఐస్ క్రీమ్స్ ఉత్పత్తి చేస్తూ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడంలో కంపెనీ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. 2022లో స్థాపించబడిన గోవిందపూర్ ప్లాంట్ 113 ఎకరాలను విస్తరించి ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీ యూనిట్‌గా గుర్తింపు పొందింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని, 2025 జనవరి 27న గోవిందపూర్ ఫెసిలిటిలో అరుణ్ ఐస్ క్రీమ్స్ “కిడ్స్ అడ్వెంచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం” ను నిర్వహించింది. 2025 జనవరి 20న ప్రారంభమైన ఈ కార్యక్రమం, పిల్లలకు స్థిరత్వం, ఐస్ క్రీమ్స్ తయారీపై అవగాహన కల్పించడంతోపాటు సంతోషకరమైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హాట్సన్ అగ్రో ప్రోడక్ట్ లిమిటెడ్ ఛైర్మన్ పద్మశ్రీ ఆర్.జి. చంద్రమోహన్ ఈ మైలురాయి గురించి మాట్లాడుతూ “ఈ ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడం, మా కార్యకలాపాల్లో అధునాతన సాంకేతికత, స్థిరత్వం పట్ల మాకు ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. గోవిందపూర్ ఫ్యాక్టరీ సౌకర్యం, బాధ్యతాయుతమైన అభివృద్ధి మరియు నాణ్యత హామీ పట్ల మా దృక్పథానికి ఒక సంకేతమని తెలిపారు.

@@@###Arun Ice Creams sets new record
Arun Ice Creams sets new record

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *