అనధికార ఆసుపత్రి సీజ్/Unauthorized hospital siege
వాయిస్ ఆఫ్ భారత్, బాలా నగర్ : సరైన వైద్య అర్హతలు లేకపోయినా అనధికారికంగా ఆసుపత్రి నడుపుతున్న ఆర్‌ఎంపీ డాక్టర్ నరేందర్ రెడ్డి క్లినిక్‌ను మెడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డా. ఉమాగౌరి సీజ్ చేశారు. బాలానగర్‌లోని రాజా కాలనీలో ఈ సంఘటన జరిగింది. అంబేద్కర్ ప్రజా శ్రేయోభిలాషి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బీఆర్‌కే బుట్టి మహర్ ఫిర్యాదు మేరకు డీఎంహెచ్‌ఓ ఈ తక్షణ చర్యలు తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం వేగంగా స్పందించిన డీఎంహెచ్‌ఓను బుట్టి మహర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా బుట్టి మహర్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి నకిలీ డాక్టర్లపై నిరంతర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆర్‌ఎంపీల పేరిట వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వారిని సహించకూడదని ఆయన స్పష్టం చేశారు.

