అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడాలి
అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడాలి
వాయిస్ అప్ భారత్ (బయ్యారం లోకల్ న్యూస్):
డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు బయ్యారం మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో అదివారం అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వేడుకలలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అన్ని రంగాలలో ప్రజలందరికీ న్యాయాన్ని అందించటమే భారత రాజ్యాంగ అంతిమ లక్ష్యమని, అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.
