YADADRI/స్వర్ణగోపుర కుంభాభిషేకానికి రావాలని సీఎంకు ఆహ్వానం

YADADRI/స్వర్ణగోపుర కుంభాభిషేకానికి రావాలని సీఎంకు ఆహ్వానం
@@YADADRI FESTIVE INIVITATION##$$$

వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : యాదాద్రిలో జరుగుతున్న శ్రీశ్రీ సుదర్శనలక్ష్మీనారసింహ దివ్యస్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. బుధవారం ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 23న స్వర్ణగోపుర మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దేవాదాయశాఖ ప్రతినిధులు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, యాదగిరిగుట్ట ఆలయ ఈవో, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఆలయ పూజారులు సీఎం రేవంత్‌కు ఆశీర్వచనం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *