TS INTER EXAMAS/తెలంగాణ ఇంటర్ పరీక్షల నియమాల్లో మార్పు
ఈనెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు
డిజిటల్, అనలాగ్ గడియారాలకు నిషేధం
హైటెక్ కాపీయింగ్ అరికట్టేందుకు కఠిన చర్యలు
వాయిస్ ఆఫ్ భారత్, తెలంగాణ : టెక్నాలజీ అభివృద్ధితో విద్యార్ధులు మేలుకోలేని మార్గాల్లో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షల్లో మోసాలను అరికట్టేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంటర్ బోర్డ్ మార్చి 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యాశాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈసారి పరీక్షా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు డిజిటల్ వాచీలు, అనలాగ్ గడియారాలను కూడా పూర్తిగా నిషేధించారు. గతంలో విద్యార్థులు సాధారణ గడియారాలు (అనలాగ్ వాచ్‌లు) ధరించి పరీక్ష హాల్లో ప్రవేశించేందుకు అనుమతి ఉండేది. అయితే, ఆధునిక టెక్నాలజీ వల్ల కాపీయింగ్ పెరుగుతుండటంతో ఈసారి అనలాగ్ వాచీలను కూడా అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతి కుమారి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు సమయం తెలిసేలా ప్రతి 30 నిమిషాలకు అలారం మోగించడంతో పాటు, ఇన్విజిలేటర్లు సమయాన్ని ప్రకటిస్తారు. పరీక్ష హాల్లోకి ఎలాంటి గడియారం పెట్టుకుని రావద్దని విద్యార్థులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

