THOUSAND FILLERS TEMPLE/వేయి స్తంభాల గుడిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఈ నెల 25 నుంచి మార్చి 1 వరకు వేడుకలు
వాయిస్ ఆఫ్ భారత్ , హనుమకొండ : ఈ నెల 25 నుంచి మార్చి 1 వరకు రుద్రేశ్వర స్వామి వారి చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయంలో మహా శివరాత్రి బ్రహ్మో త్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. సోమవారం హనుమకొండ లోని వేయి స్తంభాల దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి మార్చి 1 వరకు రుద్రేశ్వర స్వామి వారి వేయ్యి స్తంభాల దేవాలయంలో మహా శివరాత్రి సందర్బంగా 5 రోజుల పాటు స్వామి వారికీ ప్రత్యేక పూజలు,రుద్రాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 25న ఉదయం సుప్రభాతం, గణపతి పూజ, 26న సామూహిక రుద్రాభిషేకాలు, నిత్య నిధి, హావనము, రుద్రేశ్వర స్వామి వారి కళ్యానోత్సవం, 27న సుప్రభాతం, గణపతి పూజ, నాగవెల్లి, 28న అన్నపూజ, మార్చి 1న స్వామి వారికీ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఆంజనేయ స్వామి వారికీ చందనో త్సవం, ఆకుపూజా, పూర్ణహుతి, మహాపు స్పర్చనాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే ఆలయంలో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహా శివరాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, విఐపీలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అలాగే, విద్యుత్, వైద్య శిబిరం, నీటి సమస్యలు తలేత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ అనిల్ కుమార్, గట్టు మహేష్ బాబు, చోళ్ళేట్టి కృష్ణమా చారి, మధుకర్, అర్చకులు ప్రణవ్, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
