TAXISIS HERO YASH/యశ్‌ మరో రికార్డు

TAXISIS HERO YASH/యశ్‌ మరో రికార్డు
Yash, Vishal, Srinidhi Shetty At The 'KGF' Press Meet In Chennai

ఒకేసారి రెండు భాషల్లో తొలి భారతీయ సినిమా

వాయిస్ ఆఫ్ భారత్, సినిమా : కే జీఎఫ్‌ ప్రాంఛైజీ తర్వాత కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నుంచి వస్తోన్న మోస్ట్‌ ఎవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ టాక్సిక్‌. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, దర్శకుడు గీతు మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్‌ కె. నారాయణ నిర్మిస్తున్నారు. యశ్‌ కెరీర్‌లో 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి సినీ అభిమానులను తెగ ఉత్సాహపరుస్తోంది. ఈ సినిమాను ఒకేసారి కన్నడ, ఇంగ్లీష్‌ భాషల్లో షూట్‌ చేయనున్నారు, భారతీయ సినీ పరిశ్రమలో అరుదైన ఘట్టంగా నిలుస్తుంది. అంతేగాక, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్‌ చేయనున్నారు.

స్టార్‌ కాస్ట్ & కథ:
ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, బాలీవుడ్‌ నటీమణులు హ్యుమా ఖురేషి, తారా సుటారియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 1970 దశకంలో గోవా, కర్ణాటక బ్యాక్‌డ్రాప్‌లో బ్రదర్-సిస్టర్ బాండ్‌ ఆధారంగా సినిమా సాగనుందని టాక్‌.

ప్రీ-లుక్ హైప్:
ఇప్పటికే మేకర్స్‌ యశ్‌ వింటేజ్‌ టాక్సీ, రౌండప్‌ క్యాప్‌ ధరిస్తున్న ప్రీ-లుక్‌ విడుదల చేయగా, సినిమా పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. కేజీఎఫ్‌ ప్రాంఛైజీ తర్వాత యశ్‌ నుంచి వస్తున్న బిగ్‌ ప్రాజెక్ట్‌ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *