SUSIDE/అప్పుల భారంతో దంపతుల ఆత్మహత్యాయత్నం
భర్త మృతి – భార్య పరిస్థితి విషమం
వాయిస్ ఆఫ్ భారత్, ఆదిలాబాద్ : ఆర్థిక ఇబ్బందులు, ప్రకృతి అనుకూలించకపోవడంతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఆత్మహత్య బాట పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుకొండ మండలంలో ఓ రైతు దంపతులు అప్పుల భారంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వడూర్‌కు చెందిన ఆడెపు పోశెట్టి (60), ఇందిరా (52) అనే రైతు దంపతులు ఆర్థిక సమస్యల కారణంగా పురుగుల మందు సేవించారు. ఈ ఘటనలో పోశెట్టి ప్రాణాలు కోల్పోగా, గంభీరంగా ఉన్న ఇందిరాను చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.ఇద్దరికి మూడెకరాల భూమి ఉండగా, ఇటీవల పత్తి, కంది పంటలను సాగు చేశారు. అయితే పంట నష్టపోవడంతో పాటు, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ కూడా అమలుకాలేదు. అప్పుల భారంతో సతమతమైన వీరు, ఇటీవల ఇద్దరు కూతుర్ల వివాహం జరిపించడంతో పాటు కొత్త గృహం నిర్మించారు. వీరి మొత్తం అప్పు సుమారు రూ. 2.30 లక్షలుగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
