SHIVARATHRI/ ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు

SHIVARATHRI/ ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
$#@@VIVEKANANDA SEVEA SAMITHI###

వివేకానంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జాగరణ
హాజరైన గీసుకొండ సీఐ మహేందర్
సౌమిత్ర లక్ష్మీ నారాయణచార్యులు
బీజేపీ రాష్ట్ర నేత కుసుమ సతీష్
వరంగల్ వాయిస్, మొగిలిచెర్ల : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్లలో వివేకానంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గీసుకొండ సీఐ మహేందర్, ప్రముఖ విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్త స్వదేశీ జాగరణ మంచు, రాష్ట్రీయ స్వయంసేవక్ పరివార్ సభ్యుడు సౌమిత్ర లక్ష్మీ నారాయణచార్యులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివేకానంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించగా, వారి చేతుల మీదుగా భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణాచార్యులు మాట్లాడుతూ, సనాతన హిందూ ధర్మాన్ని, పురాతన ఆలయాలను, మన సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గీసుకొండ సీఐ మహేందర్ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, చిన్నారుల నృత్య ప్రదర్శన గంటన్నరసేపు ఆస్వాదించానని పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడవాలని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆధునిక సమాజంలో యువత గంజాయి, మద్యం, ఆన్ లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడొద్దని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీష్ మాట్లాడుతూ, తన అమ్మమ్మ గ్రామమైన మొగిలిచెర్లలో మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందకరమని, ఇక్కడి ఆధ్యాత్మిక చైతన్యానికి పులకరించిపోయానని, దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వివేకానంద సేవా సంస్థ కమిటీ సభ్యులను అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సంస్థ అధ్యక్షులు ఆడెపు రమేష్, ప్రధాన కార్యదర్శి కటకం సురేందర్, భూతం సుధాకర్, అచ్చ సాంబయ్య, లెంకలపల్లి స్వామి, అడ్వకేట్ రాధారపు మల్లికార్జున్, కొత్తపెళ్లి కుమారస్వామి, జీపు పతి, ప్రతిపాక తిరుపతి, అప్పని సూరి, గబ్బెట శ్రీనివాస్, దొంగల రాజు, మెరుగు సురేష్, శ్రీనిధి కళాక్షేత్రం అధినేత పసుపు లెటి శ్రీనివాస్, ఆర్కె స్టార్ బృందం ప్రతినిధి కునూరు రవి కిరణ్ పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *