SC RESERVATION/రిజర్వేషన్ ఎక్కువగా మాలలే అనుభవించారు
మందకృష్ణ మాదిగ
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : ఎస్సీ రిజర్వేషన్‌లలో మాల కులానికి ఎక్కువ ప్రయోజనాలు లభించాయని ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆరోపించారు. జనాభా ప్రాతిపదికగా కాకుండా రిజర్వేషన్‌లను విభజించడం అన్యాయమని, ఈ అసమతుల్యతను సరిచేయాలనే ఉద్దేశంతో వర్గీకరణ ఉద్యమాన్ని చేపడితే మాలలు వ్యతిరేకించారని విమర్శించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జస్టిస్ షమీ అక్తర్ నివేదిక శాస్త్రీయత లేనిదని, గ్రూపుల విభజన సరిగా చేయలేదని పేర్కొన్నారు. ఎస్సీలలోని నేతకాని, మహార్, ఓలియ దాసరి, మాల దాసరి, మిత్ అయ్యల్‌వార్, డోర్, మంగ్, మాంగ్ గరోడి తదితర కులాలను ప్రత్యేక గ్రూపులో కాకుండా గ్రూపు-3లో చేర్చారని, మాల కులం ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో సమర్థమైన న్యాయం జరగాలని, అన్ని కులాలకు తహసీల్దార్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వెంకటేష్ మెహతా మాట్లాడుతూ నేతకాని కులస్థులను ప్రత్యేక గ్రూపులో చేర్చాలని, మాలలతో కలసి ఉండమని సూచించారు. కార్యక్రమంలో బి.దీపక్‌కుమార్, పృథ్వీరాజ్ యాదవ్, దుర్గం రాజేష్, రాంబాబు, బాలాజీ, చంద్రశేఖర్, సోమయ్య, కిష్టయ్య, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
