RAMCHARAN/ఢిల్లీలో రామ్‌చరణ్‌ షూటింగ్‌

RAMCHARAN/ఢిల్లీలో రామ్‌చరణ్‌ షూటింగ్‌
@@!!@#HERO RAMCHARAN SHOOTING##@@@

 బర్త్‌డే స్పెషల్‌గా టీజర్‌ ప్లాన్‌

అభిమానుల్లో భారీ అంచనాలు

వాయిస్ ఆఫ్ భారత్, సినిమా : రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామా సినిమా గురించి ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటించగా, శివ రాజ్‌కుమార్‌, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తాజాగా హైదరాబాద్‌లోని ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో రామ్‌చరణ్‌, దివ్యేందులపై క్రికెట్‌ నేపథ్యంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక తదుపరి షెడ్యూల్‌ మార్చి మొదటి వారంలో ఢల్లీలో ప్రారంభంకానుంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌ సహా ప్రధాన తారాగణంపై కుస్తీ నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సమాచారం. కథలో క్రికెట్‌, కుస్తీతో పాటు మరికొన్ని క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రామ్‌చరణ్‌ ఈ చిత్రంలో ఓ కొత్త తరహా క్యారెక్టరైజేషన్‌లో కనిపించి అందర్నీ ఆకట్టుకోనున్నారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే పేరు పరిశీలనలో ఉండగా, మరో రెండు టైటిల్స్‌ కూడా పరిశీలిస్తున్నారు. రామ్‌చరణ్‌ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ టీజర్‌ను విడుదల చేసే అవకాశముందని సమాచారం. ఈ చిత్రానికి మాస్ట్రో ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *