PRIYAMANI/మా పుట్టబోయే పిల్లలపై కామెంట్స్ చేస్తున్నారు : ప్రియమణి

PRIYAMANI/మా పుట్టబోయే పిల్లలపై కామెంట్స్ చేస్తున్నారు : ప్రియమణి
@@#$PRIYAMAN HOT COMMENTS##$$

వాయిస్ ఆఫ్ భారత్, సినిమా : ఇండస్ట్రీలో సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ, ప్రియమణి ఇప్పటికీ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, వివాహం అనంతరం ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. 2017లో ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ప్రియమణి, తన పెళ్లిపై ఇప్పటికీ ట్రోల్స్ కొనసాగుతున్నాయని వాపోయారు. ‘ఎనిమిదేళ్ల క్రితం మా పెళ్లి జరిగింది. అప్పటినుంచి ఇప్పటికీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మతాంతర వివాహం కారణంగా ‘లవ్ జిహాద్’ ఆరోపణలు ఎదుర్కొనాల్సి వచ్చింది. మా పిల్లల గురించి కూడా అనవసరంగా కామెంట్స్ చేస్తున్నారు. మేము పిల్లలు పుట్టిన తర్వాత వారు ఐసిస్‌లో చేరతారని ఎవరూ ఊహించగలరా? ఇలాంటి వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. నేను మీడియా వ్యక్తిని కావడంతో విమర్శలను పట్టించుకోను. కానీ నా భర్తపై అనవసరంగా విమర్శలు చేయడం ఎందుకు?’’ అని ప్రియమణి తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *