ONLINE PAYMENTES IN TGRTC/ఆర్టీసీలో ఆన్ లైన్ చెల్లింపులు
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఆన్ లైన్ చెల్లింపులతో టికెట్ తీసుకోవచ్చు.. ప్రస్తుతమైతే గ్రేటర హైదరాబాద్ లో డిజిటల్ పేమెంట్స్ ను ఆర్టీసీ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక్కడ సక్సెస్ అయితే రాష్ట్రం మొత్తం విస్తరించే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోంది. డిజిటల్ పేమెంట్స్ ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి చిల్లర సమస్యకు పరిష్కారం లభించే ఛాన్స్ ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ పై కండక్టర్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్యాసింజర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
