MULTIPLEXES/ మల్టీప్లెక్స్‌లకు హైకోర్టు ఊరట
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : మల్టీప్లెక్స్ థియేటర్ల విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 16 సంవత్సరాలలోపు చిన్నారులను అన్ని షోలకు అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన హైకోర్టు, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ స్పెషల్ షోలకు మాత్రం అనుమతి నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్లో, చిన్నారులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 ఏళ్లలోపు చిన్నారులు మల్టీప్లెక్స్ థియేటర్లకు వెళ్లకూడదని సూచించింది. అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. మల్టీప్లెక్స్ యాజమాన్యం హైకోర్టు ఉత్తర్వులపై వ్యతిరేకంగా పోరాడుతోంది. 16 ఏళ్లలోపు పిల్లలను అనుమతించే విషయంలో కొత్త మార్గదర్శకాలను హైకోర్టు ప్రవేశపెట్టింది. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్లు వాదించగా, ప్రభుత్వం మాత్రం స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది.
