KONDA SUREKH /మాజీ సీఎంపై కొండా సురేఖ సెటైర్
వాయిస్ ఆఫ్ భారత్ , తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదనే అంశంపై మంత్రి కొండా సురేఖ తనదైన శైలిలో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డును ప్రస్తావిస్తూ, మాజీ సీఎంపై ఆమె సెటైర్ వేశారు. కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడమే ఓ పెద్ద రికార్డు అంటూ ఎద్దేవా చేసిన మంత్రి సురేఖ, దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం హర్షణీయమని పేర్కొన్నారు. “విరాట్ కోహ్లీ 14 వేల రన్స్ పూర్తి చేసి రికార్డు సృష్టించగా, ప్రతిపక్ష నేత కేసీఆర్ 14 నెలల్లో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాకపోవడం మరో రికార్డు!” అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై స్పందించకుండా, ప్రజలకు అందుబాటులో లేకపోవడం దేశ రాజకీయ చరిత్రలో ఓ ప్రత్యేకమైన రికార్డు కాదా? అని నిలదీశారు. “కోహ్లీ 14 వేల రన్స్ పూర్తి చేసి వార్తల్లో నిలిస్తే, ప్రతిపక్ష నేత కేసీఆర్ 14 నెలలుగా అసెంబ్లీకి రాకపోవడం మరో రీతిలో వార్తల్లోకి ఎక్కిన విషయం అందరికీ ఆలోచనీయమే!” అంటూ మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు.
