KALESHWARM/కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పొడిగింపు
ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ ఉత్వర్వులు జారీ
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కొనసాగుతున్న విచారణను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నేతృత్వంలో చేపడుతున్నారు. తాజాగా, ఈ కమిషన్ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది మార్చిలో కమిషన్ ఏర్పాటు చేయగా, ఏప్రిల్ నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు నీటిపారుదల శాఖలో పనిచేసిన ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లతో సహా చీఫ్ ఇంజినీర్లు, ఎస్‌ఈలు తదితరులను విచారణకు పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించారు. తదుపరి దశలో, నీటిపారుదల శాఖ మాజీ, ప్రస్తుత కార్యదర్శులు, ఇతర హోదాలో పనిచేసిన ఐఏఎస్ అధికారులను విచారించి, బ్యారేజీల నిర్మాణంలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకున్నారన్న అంశంపై సాక్ష్యాలను సేకరించనున్నారు.
