INDIRAMMA HOUSES VISITING/ ఇందిరమ్మ ఇళ్లను సందర్శించిన హౌసింగ్ పీడీ రవీందర్
వాయిస్ ఆఫ్ భారత్, కమలాపూర్ : మండలంలోని దేశరాజుపల్లి గ్రామంలో హనుమకొండ హౌసింగ్ పీడీ రవీందర్, డీఈ సిద్ధార్థ నాయక్ ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి, లబ్ధిదారులకు పలు సూచనలు, సలహాలు అందించారు. గృహ నిర్మాణం కోసం 400 చ.అ.ఫీట్లకు తగ్గకుండా అదనంగా 50 లేదా 100 చ.అ.ఫీట్లు పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ పరంగా అందించే రూ.5 లక్షలతోనే ఇళ్లు నిర్మించుకోవాలని, అప్పులు చేసి అధిక వ్యయంతో ఇళ్లను నిర్మించి ఆర్థిక భారం పెంచుకోవద్దన్నారు. లబ్ధిదారుడు ఎండి పాషా, సోనీ గార్ల ఇందిరమ్మ ఇంటి తొలి దశ పనులు భరంతి లెవెల్ బెడ్ వరకు పూర్తయినందున సంబంధిత బిల్లును ఆమోదించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ, గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్ సముద్రాల కృష్ణ, మాజీ ఉపసర్పంచ్ మిట్టపల్లి సుభాష్, డీలర్ దాసరి ధనాకర్, ఒగ్గోజు చిన్న సదయ్య, అంబాల సమ్మయ్య, ఎండీ పాషా, కాందుర్ల రాము, మర్రిపల్లి సమ్మయ్య, డోబిలా మోహన్ రావు, మిట్టపల్లి సారయ్య, నాగూర్ల శ్రీకాంత్, నాగూర్ల వెంకన్న, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
