DRUG PEDDLER AREEST/మహిళా డ్రగ్ పెడ్లర్ అరెస్ట్
రూ.6 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
వాయిస్ ఆఫ్ భారత్, క్రైం : సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అంతరాష్ట్ర మహిళా డ్రగ్ పెడ్లర్‌ను అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన శతాబ్ది మన్నా (24) అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన 60 గ్రాముల డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే ప్రధాన నిందితుడు, ఆఫ్రికాకు చెందిన వారెన్ కొకరంగో ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మాదాపూర్ డీసీపీ వినీత్ వీడియో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను తెలియజేశారు. పోలీసుల అనుసంధానంలో, బెంగళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన శతాబ్ది మన్నా, అక్కడే ఆఫ్రికాకు చెందిన విద్యార్థి వారెన్ కొకరంగోతో పరిచయం ఏర్పరచుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించినట్లు గుర్తించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తూ మియాపూర్ ప్రాంతంలో పట్టుబడిందని పోలీసులు తెలిపారు. డ్రగ్ పెడ్లర్లపై గట్టి నిఘా ఉంచామని, మాదాపూర్ డీసీపీ వినీత్ హెచ్చరించారు.
