Dream it.. Make it happen./కలలు కనండి.. సాకారం చేసుకోండి
కరస్పాండెంట్ జంపాల మనోహర్
సెయింట్ థామస్ పాఠశాలలో ఘనంగా ప్రొఫెషనల్ డే
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ: నిట్ హనుమకొండలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెషనల్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ జంపాల మనోహర్ విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. హనుమకొండ జిల్లాలో తొలిసారిగా, పిల్లలకు భవిష్యత్తులో ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్మెంట్ గురించి ప్రాక్టికల్ అవగాహన కల్పించడం ద్వారా, వారు డాక్టర్, ఇంజినీర్, పైలెట్, ఆస్ట్రోనాట్ వంటి రంగాల్లో పోటీ పడేందుకు ప్రేరణ పొందాలని సూచించారు. డా.ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లుగా, గొప్ప కలలు కనడం ద్వారా రానున్న కాలంలో వారు ప్రతిష్టాత్మకమైన వ్యక్తులుగా ఎదగగలరని అభినందించారు.
