BOOMI POOJA/మదర్ మేరీ పాఠశాలకు భూమి పూజ
వాయిస్ ఆఫ్ భారత్, మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఉన్న ఎస్టీ మదర్ మేరీ పాఠశాల నూతన భవనంకు భూమి పూజ చేశారు. గురువారం ఉదయం డాక్టర్ ఉడుమల బాల డిడి ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఎస్ టీ మదర్ మేరీ పాఠశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొని నృత్యాలు చేసిన పిల్లలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మదర్ మేరీ పాఠశాల యాజమాన్యం జోకేష్ రెడ్డి, జయపాల్ పాఠశాల హెడ్మాస్టర్ కరస్పాండెంట్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు రేవెల్లి నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

